FbTelugu

విశాఖకు ఆర్టీసీ పరిపాలనా భవనం !

విశాఖ: విజయవాడలో ఉన్న ఆర్టీసీ పరిపాలనా భవనాన్ని విశాఖ పట్టణానికి తరలించే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను చేయనున్నట్లు ప్రకటించిన తరుణంలో ఆర్టీసీ పరిపాలనా భవనాన్ని కూడా తరలిస్తున్నట్టు భావిస్తున్నారు.

ఆర్టీసీ పరిపాలన భవనంగా నగరంలోని ద్వారకా బస్‌స్టేషన్‌లో ఖాళీగా ఉన్న జి+4 భవనాన్ని వినయోగించుకునే అవకాశం ఉంది. గతంలో ఈ భవనాన్ని జీవీఎస్‌సీసీఎల్‌ (గ్రేటర్‌ విశాఖ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించింది. ఇటీవల ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ప్రస్తుతం కొత్తగా రంగులేసి సిద్ధం చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.