FbTelugu

15 రోజుల్లో పెట్రోల్ పై రూ.7.97 పెంపు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత కొన్ని రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. దేశ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 15 రోజులు చమురు ధరలు పెరుగుతూనే వచ్చాయి.

గడిచిన 15 రోజుల్లోనే పెట్రోల్ పై మొత్తం రూ.7.97 పెరిగింది. ఇదే సమయంలో డీజిల్ పై రూ.8.88 పెరిగింది. తాజాగా నిన్న పెట్రోల్ పై 35 పైసలు, డీజిల్ పై 60 పైసలు పెరిగింది. నేడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.82.25, డీజిల్ ధర రూ.76.49 గా ఉంది.

You might also like