FbTelugu

అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్

అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో శవం తరలింపునకు బేర సారాలు జరిగాయి.
నందమూరి నగర్‌కు చెందిన బొమ్మయ్య అనే వ్యక్తి కరోనా సోకి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో బొమ్మయ్య శవాన్ని తరలించేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. ఆయన భార్య ఐదేళ్ల క్రితమే మృతి చెందింది.

ఈ విషయం తెలిసిన కొందరు దాతలు అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే మార్చురీ సిబ్బంది రూ.60 వేలు డిమాండ్ చేసింది. చివరకు రూ.45 వేలు ఇస్తే అంత్యక్రియలు చేస్తాం లేదంటే మీరే చేసుకోండంటూ సమాధానమిచ్చారు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో బొమ్మయ్య మృతదేహం మార్చురీలోనే ఉంది.

You might also like