FbTelugu

రూ.550 కే రెండు డోసుల వ్యాక్సిన్

ఆగస్టు నుంచి ఉత్పత్తి, పంపిణీ ప్రారంభం
హైదరాబాద్: ప్రస్తుతం దేశంలో మూడు కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా నాలుగో వ్యాక్సిన్ కూడా త్వరలో మార్కెట్ లోకి రాబోతున్నది. అది కూడా అతి తక్కువ ధరకు అందచేయనున్నారు.
మార్కెట్ లో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్ల ధరలు రూ.1 వేయికి అటుఇటుగా ఉన్నాయి. రెండు డోసులు వేసుకోవాలంటే రూ.2,500 వరకు వెచ్చించాల్సి వస్తున్నది. ఆగస్టు నెలలో మార్కెట్ లోకి రానున్న కార్బెవాక్ రెండు డోసులు రూ.500 కే ఇచ్చ యోచనలో ఉన్నట్లు తెలిసింది. రూ.400 కే ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఉత్పత్తి చేస్తున్న బయోలాజికల్ ఈ వెల్లడించినట్లు సమాచారం. ఈ కంపెనీ నుంచి 30 కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అగ్రిమెంట్ కుదుర్చుకున్నది.

ఇందుకోసం రూ.1,500 కోట్లు అడ్వాన్స్ గా చెల్లించనున్నట్లు తెలిసింది. ప్రతి నెలా దాదాపు 8 కోట్ల చొప్పున ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వానికి అందచేయనున్నారు. ఈ వ్యాక్సిన్ కు సంబంధించిన మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఇటీవలే పూర్తయ్యాయి. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. దేశంలోని 15 ప్రాంతాల్లో మూడో దశ ప్రయోగాలు ఆరోగ్యవంతులైన 18 నుంచి 80ఏళ్ల వయస్సు ఉన్న వారిపై జరుగుతున్నాయి. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కు ఉపయోగించిన సాంకేతికతను కర్బెవాక్స్ వ్యాక్సిన్ లో ఉపయోగించినట్లు బయాలాజికల్ ఈ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ పద్దతిలో మొదట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ గా కార్బెవాక్స్ నిలువనున్నట్లు పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.