FbTelugu

కడప స్టీల్ ప్లాంట్ కు రూ.500 కోట్లు

సీఎం వైఎస్.జగన్ రెడ్డి ఆదేశాలు

అమరావతి: కడపలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవాళ కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌ రెడ్డి సమీక్షించారు. పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ హాజరయ్యారు. కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించగా, ఆ సంస్థలతో చర్చలు జరపాలని సీఎం ఆదేశించారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు తెలిపారు.

రెండు సంవత్సరాల్లోగా టౌన్‌షిప్, అనుబంధ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్‌ వాల్, విద్యుత్‌ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటు సమకూర్చాలన్నారు.

ఆర్టీపీపీ లైన్‌ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, అలాగే ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.