FbTelugu

విశాఖలో పట్టుబడిన రూ.50 లక్షలు

విశాఖపట్నం: ద్వారకా బస్‌స్టేషన్‌లో పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. సంచిలో భారీగా నగదు తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం రూ. 50.38 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి  తగిన ఆధారాలు చూపలేకపోయాడు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జయదేవ నగల దుకాణం యజమాని ప్రవీణ్ కుమార్ జైన్ దగ్గర క్లర్క్‌గా పనిచేస్తున్న నరసింహారావు నుంచి పోలీసులు ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

You might also like