FbTelugu

రూ.5 కోట్ల నగదు మావోయిస్టులదేనా?

ముంబయి: మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో ఇవాళ ఉదయం పోలీసులు తనిఖీలు చేస్తుండగా పెద్ద ఎత్తున నగదు తరలిస్తున్న వాహనం పట్టుబడింది. గోరఖ్ దందా గ్రామంలో డబ్బుల రవాణాకు సంబంధించి 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి అందచేయాలనే దానిపై మహారాష్ట్ర పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలోని మావోయిస్టులకు ఇవ్వడానికి ఈ డబ్బులు సమకూర్చినట్లు వారి నుంచి ప్రాథమికంగా సమాచారం రాబట్టారు. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖ తో పాటు తెలంగాణ పోలీసులకు కూడా తెలియచేశారు. అక్కడి నుంచి నగదును ముంబయి పోలీసు హెడ్ క్వార్టర్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అనుమానితులను లోతుగా విచారించేందుకు ప్రత్యేక వాహనాల్లో జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.