FbTelugu

లోపం గుర్తించిన ఉద్యోగికి రూ.44 లక్షలు

సోషల్ మెస్సేంజర్ ఫేస్ బుక్ తన సంస్థలో పనిచేసే ఉద్యోగకి రూ.44 లక్షలు నజరానా ప్రకటించింది. మెస్సేంజర్ యాప్ లో ముఖ్యమైన లోపాన్ని గుర్తించినందుకు ఈ బహుమతిని అందచేశారు.

యాప్ లో ఇద్దరి మధ్య జరిగే కాల్ సంభాషనలను హ్యాకర్లు వినే అవకాశం ఉందని నటాలీ సిల్వనోవిచ్ అనే మహిళా ఉద్యోగి కనుగొన్నది. గూగుల్ కు చెందిన ప్రాజెక్టు జీరో బగ్ హంటింగ్ ప్రాజెక్టులో నటాలీ పనిచేస్తున్నది. అయితే ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాం పై పనిచేసే యాప్ లో మాత్రమే కనుగొన్నట్లు ఆమె పేర్కొంది. ఈ లోపాన్ని అక్టోబర్ 6వ తేదీన గుర్తించి, పై స్థాయి ఉద్యోగులకు సమాచారం పంపించింది. యాప్ లో లోపాన్ని గుర్తించిన ఆమెకు రూ.44 లక్షలు అందచేసింది. ఈ లోపాన్ని సరిచేశారు కూడా. గతంలో ఈమె రిలయన్స్ జియో ఛాట్, సిగ్నల్, వీ ఛాట్, వాట్సప్, ఐ మెస్సేజ్ లలో ఇటువంటి లోపాలను గుర్తించడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.