FbTelugu

ఏడాదిలో సంక్షేమానికి రూ.42వేల కోట్లు: జగన్

అమరావతి: కొన్ని శతాబ్దాలుగా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రజలకు సేవ చేస్తూ కేవలం తమ చెమటను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పధకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వైఎస్.జగన్ రెడ్డి అన్నారు.

ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో జగనన్న చేదోడు పధకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, జేసీలతో ఆయన మాట్లాడారు. నా పాదయాత్రలో చెప్పిన ప్రతీ హమీ అమలులో భాగంగా ఈ రోజు నా రజక, నా నాయీ బ్రహ్మణ, దర్జీ వృత్తిలో ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఈ హమీ అమలు చేయడం చాలా సంతోషాన్నిస్తుందన్నారు.

షాపులున్న రజక, నాయీబ్రహ్మణ, దర్జీ సోదరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున రూ.247 కోట్లు వారి వారి బ్యాంక్‌ అకౌంట్లలో నేరుగా జమచేస్తున్నామని జగన్ అన్నారు. ఇప్పటికైనా రాని వారు అర్హత ఉంటే అప్లికేషన్‌ పెడితే వెరిఫికేషన్‌ చేసి ఒక నెలరోజుల్లోగా అందరికీ అందజేస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అని ఆలోచిస్తుంది కానీ ఎలా కత్తిరించాలి అని ఆలోచించే ప్రభుత్వం కాదు అని అన్నారు.

పాదయాత్రలో చెప్పిన ప్రతీ మాట కూడా చేయగలిగాను అని సగర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ ఏడాది కాలంలో రూ.42,465 కోట్లు దాదాపుగా రూ.3.58 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి ఇవ్వగలిగామన్నారు. బహుశా రాష్ట్రచరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో పేదవారికి తోడుగా ఉన్న ప్రభుత్వం ఎప్పుడూ లేదు, దేవుని దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాలు చేయగలిగామని జగన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.