హైదరాబాద్: ఐటీ దాడుల్లో ఈ మధ్య భారీగా నల్లడబ్బు పట్టుబడుతోంది. బోగస్ కంపెనీలను ఏర్పాటు చేసి అవకతవకలకు పాల్పడుతోన్న ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు రూ.400 కోట్ల నల్లడబ్బును గుర్తించారు.
నగరంలో గత నెల 24న ఐటీ అధికారులు ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీపై దాడులు నిర్వహించారు. బోగస్ కంపెనీల ద్వారా ఈ కంపెనీ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం రూ.400 కోట్ల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. కంపెనీ నుంచి అధికారులు రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.