FbTelugu

అధిక వడ్డీ పేరుతో రూ.300 కోట్ల లూటీ

జిల్లా ఎస్పీని ఆశ్రయించిన బాధితులు
అనంతపురం: అధిక వడ్డీ చెల్లిస్తామంటే చాలు జనం ఎగబడి అప్పులు ఇస్తున్నారు. మొగుడికి తెలియకుండా పెళ్లాలు, పెళ్లాలకు తెలియకుండా మొగుళ్లు ఇలా అప్పులు ఇచ్చి నిండా మోసపోతున్నారు. ఒకరికి అధిక వడ్డీ చెల్లించారని మరొకరు తమదగ్గర ఉన్న సొమ్మంతా చెల్లించి నష్టపోతున్నారు.

ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో అధిక వడ్డీ పేర నిండా ముంచిన వార్తలు కోకొల్లలుగా వస్తున్నా జనం తీరులో మార్పు రావడం లేదు. రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేలు వడ్డీ చెల్లిస్తామని ఆశజూపి నిండా ముంచారంటూ బాధితులు అనంతపురం జిల్లా ఎస్పి సత్యఏసుబాబు ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. ఇలా సుమారు రూ.300 కోట్లకు పైగా డిపాజిట్లు స్వీకరించిన సదరు వ్యక్తులు ఉడాయించారని కన్నీళ్లు పెట్టుకున్నారు. సుమారు 50 మంది బాధితులతో ఎస్పీ మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.

అనంతపురంలో ఈబిఐడిడి ఫైనాన్స్‌ సర్వీసు పేరుతో ఒక ఆఫీసున ప్రారంభించారు. ఈ సంస్థ మేనేజర్‌గా కడియాల సునీల్‌ వ్యవహరించగా, సహాయకులుగా మహేంద్రచౌదరి, సుధాకర్‌, మాధవి వ్యవహరించారు. వీరి కింద 100 మంది జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లు పని చేస్తున్నారు. పెద్ద ఎత్తున డిపాజిట్లు చెల్లించిన తర్వాత ఏజెంట్ల మొబైల్‌ పని చేయకపోవడం డిపాజిట్ దారులకు అనుమానం వచ్చింది. రెండు, మూడు నెలలుగా వడ్డీలు చెల్లించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వసంతపురానికి చెందిన బాబుల్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ధర్మవరం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.