FbTelugu

తహశీల్దార్ ఇంట్లో రూ.30 లక్షలు పట్టివేత

హైదరాబాద్: షేక్ పేట తహశీల్దార్ సుజాత నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆమె నివాసంలో సుమారు రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

బంజారాహిల్స్ లో ఒకటిన్నర ఎకర స్థల వివాదంలో రూ.15 లక్షలు తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డాడు. అతనిచ్చిన సమాచారం ప్రకారం తహశీల్దార్ నివాసం, ఛాంబర్ పై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు.

లాక్ డౌన్ సమయంలో సయ్యద్ అనే వ్యక్తి ఒకటిన్నర ఎకరా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడు. ఆ స్థలంలో ఉన్న ప్రభుత్వ బోర్డును తొలగించి, రెవెన్యూ అధికారులతో బేరసారాలు సాగించాడు. చివరకు రూ.50 లక్షలు తీసుకుని సెటిల్ చేసుకుందామని ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా ఇవాళ సయ్యద్ రూ.15 లక్షలు అందచేసి, ఏసీబీ అధికారులకు పట్టించాడు. ఇందులో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో ఉన్న ఎస్సై రవీంద్రనాయక్ హస్తం ఉందని, అతనికి కూడా వాటా ఉందని తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

You might also like