FbTelugu

టీటీడీ కాటేజీల ఆధునీకరణకు రూ.29కోట్లు

తిరుమల: కాటేజీల ఆధునీకరణకు రూ.29 కోట్లు కేటాయించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి తీర్మానం చేసింది.
హిందూ దర్మప్రచారంలో భాగంగా చైతన్య రాథలను నడపాలని నిర్ణయం కొంత బోర్డు సభ్యులు చైతన్య రాథలను విరాళం ఇస్తామన్నారు‌. టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. పెద ప్రజలకు కళ్యాణ మస్తు కార్యక్రమం నిర్వహించాలని, బాలా మందిరంలో రూ.10 కోట్లతో అదనపు గదులు నిర్మాణానికి అమోదం తెలిపారు. తమిళనాడు లోని వులందురు పేటలో శ్రీవారి ఆలయం నిర్మాణం చేయాలని నిర్ణయించారు.
డిసెంబరు 25 వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాలు 10 రోజులు పాటు తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం ఒక కమిటీ వేసామని అన్ని మఠాధిపతిలకు వారి సలహా మేరకు బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆస్తుల గురించి వేలం వేసే ఆలోచన లేదని, శ్వేత పత్రం విడుదల చేయనున్నారు. దేశంలో మొత్తం 1128 శ్రీవారి ఆస్తుల వున్నాయి.

శ్రీవారి ఆలయం మహా ద్వారం తలుపులు ధ్వజస్తంభానికి 6.6 కేజీల బంగారంతో తాపడం పనులకు అమోదం తెలిపారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి యూనిఫాం అలవెన్సు రూ.2000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలక మండలి కోరింది. 11.7 కేజీల బంగారంతో పద్మావతి అమ్మవారి సుర్యప్రభ వాహనాన్నికి బంగారు తాపడం పనులకు అమోదం తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.