FbTelugu

రూ.2500కే జియో 5జి ఫోన్

ముంబయి: డిజిటల్ రంగంలో విప్లవం సృష్టించి సగటు వ్యక్తికి మొబైల్ నెట్ చౌకగా అందించిన జియో సంస్థ మరో సంచలనానికి తెరతీస్తున్నది. త్వరలో చౌక ధరలో 5జి ఫోన్ ను తీసుకురావాలనే యోచనలో ఉంది.
ఈ విషయాన్ని గతేడాది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబాని ప్రకటించిన విషయం విదితమే. ఈ నెల 24వ తేదీన రిలయన్స్ షేర్ హోల్డర్స్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో 5జి ఫోన్ విడుదల చేయనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫోన్ తీసుకురావడంతో మార్కెట్ లో తన వాటాను పెంచుకోవాలని చూస్తున్నది.

ఫోన్ ప్రారంభ ధర రూ.2500 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు ఉండవచ్చని ఒక అంచనా. దేశంలో 2జి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 5జి ఫోన్ తీసుకువస్తున్నారు. దీని ద్వారా కనీసం 20 కోట్ల మంది వినియోగదారులకు చేరువకానున్నారు. ప్రస్తుతం దేశంలో 5జి ఫోన్ల ప్రారంభ ధర రూ.15వేల నుంచి పలుకుతోంది. రానున్న కాలంలో ఆ ఫోన్లకే డిమాండ్ ఉంటుందనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా కొనుగోలు చేస్తున్నారు. షేర్ హోల్డర్స్ సమావేశంలో తక్కువ ధరలో జియో ల్యాప్ టాప్ ను ఆవిష్కరించనున్నారు. ఈ ల్యాప్ టాప్ 4జి కనెక్టివిటీ సపోర్టు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.