FbTelugu

యాదాద్రిలో ప్రతి గ్రామానికి రూ.25 లక్షలు: కెసిఆర్

యాదాద్రి: జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున ప్రత్యేన నిధులు మంజూరు చేస్తున్నట్లు సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఆరు మున్సిపాల్టీలకు కూడా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఇవాళ వాసాలమర్రిలో గ్రామస్థులతో కలిసి సిఎం కెసిఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ నిధులను ఖర్చు చేసేందుకు గ్రామ అభివృద్ధి కమిటీలు వేయాలన్నారు. ఇప్పటి నుంచి కులం లేదు, మతం లేదు, జాతి లేదన్నారు. మనందరికీ ఒకే కులం అదే అభివృద్ధి కులమన్నారు. ఏడాది తిరిగే సరికి వాసాలమర్రి బంగారు వాసాలమర్రి కావాలని సిఎం అభిలాషించారు. గ్రామస్థులకు 23 రకాల వంటకాలను వడ్డించారు. మటన్, చికెన్ మాంసం, ఆకు కూలర, బోటి కూర, తలకాయ పులుసు, చేపల పులుసు, కోడిగుడ్డు కూర, రెండు రకాలు స్వీట్లు, పాలక్ పన్నీర్, మటన్ బిర్యానీ, పులిహోర, సాంబారు, పండ్ల రసాలను గ్రామస్థులకు వడ్డించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.