FbTelugu

నటీనటులకే రూ.200 కోట్లు… సినిమా ఖర్చెంత?

ఈ పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఒక భాషలో కాకుండా నాలుగైదు భాషల్లో సినిమాలు తీస్తున్నారు. దక్షిణాది భాషలకే పరిమితం అయిన దర్శకులు ఉత్తరాది భాషల్లో తీస్తూ షెహబాష్ అనిపించుకుంటున్నారు.

పాన్ ఇండియా సినిమాలతో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ అమాంతం పెరిగిపోయింది. ఒకటి రెండు సినిమాలతో స్టార్ డమ్ చేరుకున్న హీరోలు తాము కోరినంతగా పారితోషికం డిమాండ్ చేసి తీసుకుంటున్నారు. స్టార్ హీరోలతో చేస్తే కలెక్షన్లకు ఢోకా ఉండదని వారు అడిగినంత ముట్టచెబుతున్నారు. హీరో ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్వన్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలసిందే. సినిమాకు ఎంత ఖర్చు చేస్తున్నది తెలియదు కాని నటిస్తున్న నటులకు మాత్రం రూ.200 కోట్లు ఇస్తున్నారు. నటీనటులకే రూ.200 కోట్లు చెల్లిస్తున్నారంటే చిత్రానికి ఎంత ఖర్చవుతుందే చెప్పలేం మరి. ప్రభాస్ ఒక్కడే రూ.100 కోట్లు తీసుకుంటన్నాడని చిత్ర పరిశ్రమలో చర్చించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్ తో మరో ఏడెనిమిది నటులు ముఖ్యపాత్రలో కన్పించనున్నారు. జూలైలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.