FbTelugu

కల్నల్ కుటుంబానికి రూ.20కోట్ల స్థలం

హైదరాబాద్: చైనా సరిహద్దులో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం నివాస స్థలం అప్పగిస్తోంది.
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఇవాళ పరిశీలించారు. షేక్ పేట మండలంలో మూడు స్థలాల్లో ఇష్టం వచ్చిన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని కోరగా, కేబీఆర్ పార్కుకు ఎదురుగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా స్థలం డాక్యుమెంట్లను సంతోష్ బాబు భార్యకు అప్పగించనున్నారు.

You might also like