FbTelugu

కరోనా మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు

అమ‌రావ‌తి: కరోనా పాజిటివ్ సోకి చికిత్స పొందుతూ చనిపోయిన వారి అంత్యక్రియల విషయంలో అమానుషంగా ప్రవర్తించడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

వైరస్ తో మరణించిన వారికి అంత్యక్రియల విషయంలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ని కదలించాయి. కరోనా వైరస్ బారిన పడి చనిపోయిన వారి దహన సంస్కారాల కోసం రూ.15 వేల చొప్పున సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు తక్షణం చర్యలు తీసుకోవాలని, దీనిపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారుల‌ను సీఎం జ‌గ‌న్ కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.