FbTelugu

కరోనాతో చనిపోతే రూ.15వేల సాయం: ఏపి సర్కార్

అమరావతి: కరోనా పాజిటివ్ తో పోరాడుతూ చనిపోయిన వారి అంత్యక్రియలకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని ఏపి వెైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయంపై జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొనసాగినంత కాలం  మృతుల అంతిమ సంస్కారాలకు ఆర్థిక సాయం కొనసాగిస్తామని ప్రకటించింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా కరోనా వ్యాధిని ఆరోగ్య శ్రీలో చేర్చింది. ఆరోగ్య శ్రీ కార్డుదారులకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లను ప్రభుత్వం ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.