FbTelugu

జర్నలిస్టులకు రూ.15 లక్షల పరిహారం: ఒడిశా సీఎం

భువనేశ్వర్: రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి రూ. 15 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.

వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంలో జర్నలిస్టుల పాత్ర  కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నిబద్ధతతో పని చేస్తున్నారని  కొనియాడారు. కరోనా వైరస్‌ సోకి ఎవరైనా జర్నలిస్టు చనిపోతే ఆ వ్యక్తి కుటుంబానికి వెంటనే రూ.15 లక్షలు అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

జర్నలిస్టుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్న సీఎంకు ఒడిశా ప్రభుత్వ మీడియా సలహాదారు మనాస్ మంగరాజ్‌ కృత జ్ఞతలు తెలిపారు. కరోనా రోగులకు చికిత్స చేస్తూ వైద్యులు చనిపోతే అమరుల హోదా కల్పిస్తామని పట్నాయక్ ఇదివరకే ప్రకటించారు.

ఒడిశా బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ కు లేఖ రాశారు. లాక్ డౌన్ సమయంలో పనిచేస్తున్న  జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ ప్రవేశ పెట్టాలని కోరారు. ఇప్పటికే ముంబబై, చెన్నై, భోపాల్ లో జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చిందని గుర్తు చేశారు.

You might also like