FbTelugu

సీఎం సహాయ నిధిలో రూ.112 కోట్లకు గాలం

అమరావతి: ఏపీలో భారీ కుట్రకు కేటుగాళ్లు పన్నాగం పన్నారు. ఏకంగా సీఎం రిలీఫ్ ఫండ్ పైనే కన్నేశారు. వివరాల్లోకెళితే.. కొందరు కేటుగాళ్లు సీఎం సహాయ నిధి నుంచి రూ.112 కోట్లు కొల్లగొట్టేందుకు భారీ కుట్రపన్నారు.

నకిలీ చెక్కులతో రూ.112 కోట్లు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. అయితే బ్యాంక్ అధికారుల అప్రమత్తతతో భారీ కుంభకోణం బట్టబయలైంది. ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతాలోని మూడు బ్యాంకుల ద్వారా నగదును మార్చుకునేందుకు యత్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.