FbTelugu

మహిళల ఖాతాల్లోకి రూ.1,109 కోట్లు: జగన్

అమరావతి: మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పిస్తూ, తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బ్యాంకుల ద్వారా నేరుగా సున్నా వడ్డీకే రుణాలు అందజేసి మహిళా సాధికారతను ఆచరణలోకి తీసురాగలిగామని ఆయన తెలిపారు.

మహిళా స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ నిధులను ఆన్‌లైన్‌ ద్వారా జగన్ విడుదల చేశారు. దీనివల్ల 1.02 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ. 1,109 కోట్లు జమ అవుతాయని అన్నారు. తమ ప్రభుత్వ పాలనలో మహిళా సాధికారత కల్పించామని జగన్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.