FbTelugu

ఒక్కో వలస కూలీకి రూ.10 వేలు ఇవ్వాలి: సీపీఐ నారాయణ

మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకు పోయి సర్వస్వం కోల్పోయిన వలస కూలీలకు ఒక్కొక్కరికి రూ.10 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. ఇవాళ మక్తల్ లో చిక్కుకు పోయిన బీహార్ వలస కూలీలను ఆయన పరామర్శించారు. అనంతరం కూలీలతో కలిసి గవర్నర్ ను కలిసేందుకు యత్నించారు. కాగా అధికారులు నారాయణకు మాత్రమే అవకాశం ఇస్తామన్నారు. కూలీలందరినీ స్వస్థలాలకు పంపిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.