FbTelugu

మాస్క్ లేకుంటే రూ.10వేల జరిమానా!

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. మాస్క్ లేకుండా బయటకు వస్తే రూ.10వేలు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్షవిధించనున్నారు.

బహిరంగ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా ఉండ కూడ‌దని ప్రభుత్వం స్పష్టం చేసింది. ర‌ద్దీ ప్రాంతాల్లో ప్ర‌తి ఒక్క‌రూ భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్ ధ‌రించాల‌ని ఆదేశాలు జారీ చేసింది. ఒక వేళ మాస్క్ ధ‌రించ‌కుండా బయటకు వస్తే రూ. 10 వేలు జ‌రిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష‌ విధిస్తామ‌ని హెచ్చ‌రించింది.
అయితే ఈ నిబంధ‌న‌లు ఏడాది కాలం పాటు అమ‌ల్లో ఉంటాయ‌ని కేర‌ళ ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. అలాగే ర‌ద్దీ ప్రాంతాల‌తో పాటు రోడ్లు, ఫుట్ పాత్ ల‌పై ఉమ్మివేయ‌డాన్ని నిషేధించారు. పెళ్లిళ్ల‌కు 50 మంది మించి హాజ‌రు కాకూడ‌దు. ప్ర‌తి వివాహ వేదిక వ‌ద్ద శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. అంత్య‌క్రియ‌ల‌కు కూడా 20 మందికి మించి హాజ‌రు కావొద్దు అని ప్ర‌భుత్వం స్పష్టం చేసింది.

You might also like