FbTelugu

ప్రతివ్యక్తికీ రూ.10 వేలు సాయం: బొత్స

విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో విషవాయువు లీకేజీతో సమీప గ్రామాల ప్రజలు కొందరు ప్రాణాలు కోల్పోగా.. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

ఐదు గ్రామాల్లో ఐదు మెడికల్ టీంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. బాధిత గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రూ.10,000 సాయం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే బాధిత గ్రామాల్లో 90 శాతం ప్రజలు గ్రామాలకు తిరిగి వచ్చారని తెలిపారు.

You might also like