FbTelugu

మాస్క్ లేకుంటే రూ.1 వెయ్యి ఫైన్: సీఎం విజయ్

అహ్మదాబాద్: సామాజిక దూరంతో పాటు కనీసం మాస్క్ లు కూడా ధరించకపోవడంతో గుజరాత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేసులను కట్టడి చేసేందుకు మాస్క్ లు ధరించని వారిపై రూ.1 వెయ్యి చొప్పున ఫైన్ విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ మేరకు గుజరాత్ సీఎం విజయ్ రూపాని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు రూ.200 మాత్రమే విధిస్తున్నారు. ఇక నుంచి (ఆగస్టు 11) రూ.1 వెయ్యి చొప్పున విధించనున్నారు. రాష్ట్రంలో రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు 71వేల కేసులు నమోదు కాగా 2684 మంది మరణించారు.

You might also like