FbTelugu

గని మృతులకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

అమరావతి: కడప జల్లా మామిళ్లపల్లె పేలుడు ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించామని మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 5 ప్రభుత్వ శాఖలతో విచారణ కమిటీ ఏర్పాటు అయ్యిందన్నారు.

ఐదు రోజుల్లో ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తారని మంత్రి రామచంద్రారెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడ్డవారికి రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా మంజూరు చేసినట్లు తెలిపారు. గని లీజుదారుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ నేతృత్వంలో ఘటనాస్థలాన్ని మైనింగ్ అధికారులు పరిశీలించారన్నారు. క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించారన్నారు. పేలుడు పదార్థాల అన్‍లోడింగ్లోల నిబంధనలు పాటించలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.