FbTelugu

RRR…ఊహించని షాక్ షూటింగ్ ఇంకా మిగిలే ఉంది…రాజమౌళి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’. ఈ చిత్రం రిలీజ్ కోసం,  ట్రైలర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2022 జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన మేకర్స్.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. అయితే అదే సమయంలో మీడియాలో మరో వార్త ప్రచారం అవుతోంది. అదే నిజమైతే పెద్ద షాకే.

అందేంటంటే ఈ చిత్రం షూటింగ్  మొత్తం కంప్లీట్ అయిందని చిత్ర టీమ్ ప్రకటించినా ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉందనేది ఆ వార్త సారాంశం. రామ్ చరణ్ – అలియా భట్ లపై ప్లాన్ చేసిన ఓ పాటను చిత్రీకరించాల్సి ఉందని.. డిసెంబర్ రెండో వారంలో షూట్ చేయాలని ప్లాన్  చేస్తున్నారని అంటున్నారు.షూటింగ్ మొత్తం ఇప్పటికే పూర్తయిందని అందరూ భావిస్తుండగా.. ఇప్పుడు తాజాగా ఈ రూమర్ ఊహించని షాక్ కు గురిచేస్తోంది. ఇదే కనుక నిజమైతే ఓవైపు పాట షూటింగ్ మరోవైపు ప్రమోషన్స్ ఏకకాలంలో నిర్వహించడమంటే RRR టీమ్ కి కాస్త కష్టమైన పనే అని అంటున్నారు.  అయితే  ఇందులో నిజమెంత   అనేది తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.