FbTelugu

ఆర్‌ఆర్ఆర్‌ టీం ప్రెస్‌ మీట్‌….

ఆర్‌ఆర్ఆర్‌ టీం ప్రెస్‌ మీట్‌, అలియా భట్‌ సందడి, దర్శకుధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. ఇప్పటికే షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో మూవీ టీం ప్రమోషన్స్‌లో భాగంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు(శనివారం) ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ టీం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించింది.ఈ మీడియా సమావేశంలో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, రాంచరణ్‌, జూ. ఎన్టీఆర్‌తో పాటు హీరోయిన్‌ అలియా భట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆర్‌ఆర్‌ఆర్‌ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.