FbTelugu

చివరి దశలో ఆర్ఆర్ఆర్ షూటింగ్

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తీర్చిదిద్దుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చివరి దశలో ఉంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. త్వరలోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగణ్, శ్రీయ కీలక పాత్రాల్లో నటించారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం అవుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కుమ్రం భీమ్ గా కన్పించనున్నారు. డివివి దానయ్య నిర్మాణం చేస్తున్న చిత్రానికి ఎంఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రెండు భాషల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇప్పటికే డబ్బింగ్ పూర్తి చేయగా, ఇతర భాషల్లోకి త్వరలో డబ్బింగ్ చెప్పనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.