FbTelugu

ఆర్ఆర్ఆర్… డిజిటల్ హక్కులే రూ.475 కోట్లు

ఇండియన్ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా భారీ డీల్ కుదిరింది. దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో ఆర్ఆర్ఆర్ చిత్రం ఒకటి. కాల్పనిక గాధ నేపథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుండగా ఇందులో హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

బాలీవుడ్ నిర్మాత, పెన్ ఇండియా అధినేత జయంతిలాల్ గడా రూ.475 కోట్లు డిజిటల్ హక్కుల కోసం చెల్లించారు. అన్ని భాషలకు సంబంధించిన శాటిలైట్, డిజిటల్ హక్కులు దక్కించుకున్నారు. శాటిలైట్, డిజిటల్ విభాగంలో ఇది ప్రథమమని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. జయంతిలాల్ గదా ఇప్పుడు థేయేటర్లలో సినిమా ను మాత్రమే పంపిణీ చేస్తారు. హింది థియేట్రికల్ హక్కులు కూడా ఆయన వద్దే ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.