FbTelugu

108 వాహనానికి నిప్పు పెట్టిన రౌడీషీటర్

ప్రకాశం : ఓ రౌడీ షీటర్ ఏకంగా 108 వాహనానికే నిప్పుపెట్టి నానా హంగామా చేశాడు. ఈ ఘటన ఒంగోలు నగర కేంద్రంలోనే చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ స్టేషన్ కు హాజరై వెళ్లడానికి వచ్చిన సురేష్ అనే ఓ రౌడీ షీటర్ పోలీస్ స్టేషన్ లో తన చేతిని కోసుకుని చనిపోతానంటూ.. నానా హంగామా చేశాడు.. దీంతో అతనికి మతిస్థిమితం లేదని గుర్తించిన పోలీసులు 108 కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తరలించేదుకు ప్రయత్నించగా.. సురేష్ అంబులెన్స్ లోని కాటన్ కు నిప్పు పెట్టాడు. దీంతో మంటలు వ్యాపించి అంబులెన్స్ మొత్తం అగ్నికి దగ్ధమైంది.

You might also like