FbTelugu

రూటు మార్చిన నేతలు.. ఆన్లైన్ లో డబ్బు పంపిణీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పోటీచేస్తున్న అభ్యర్థులు, ఆయా పార్టీలు కొత్త రూట్లను వెతుక్కుంటున్నారు. రేపే ఎన్నికలు జరగనున్న తరుణంలో నేరుగా డబ్బు పంచే వీలు లేకపోవడంతో కొందరు ఏకంగా ఆన్లైన్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తున్నారు. కొన్ని చోట్ల గూగుల్ పే, ఫోన్ పే లను సైతం వాడుకుంటున్నారు.

దీనికి సంబంధించిన కొన్ని ఘటనలు తాజాగా బయటపడ్డాయి. ఓ ఓటరు ఫోన్ కు మెసేజ్ వచ్చింది ఏంటా అని చూస్తే రూ.5000 క్రెడిట్ అయినట్టుగా చూపిస్తోంది. ఆశ్చర్యపోయిన అదే ఓటరుకు ఓ ఫోన్ కాల్ చేసిన బూత్ కమిటీ ఇంచార్జ్ తామే డబ్బువేశామని తమ అభ్యర్థికే ఓటు వేయాలంటూ తెలిపాడు. ఈ తతంగానికి సంబంధించిన ఓ రికార్డు తాజాగా వెలుగులోకి వచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.