FbTelugu

8 మందితో వెళుతున్న ఆటో బోల్తా

విజయనగరం: 8 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ఆటో బోల్తా పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంది పలువురికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని నడిమిగూడ దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నడిమిగూడ గ్రామ సమీపంలో 8 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ఆటో ప్రమాదవశాత్తూ బొల్తా పడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మిగతా వారికి తీవ్రగాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like