FbTelugu

న‌యీమ్ కేసులో ప్రముఖుల పాత్రపై విచారణ జరపాలి

* రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్‌ లేఖ
* నయీమ్ చనిపోయినా.. నేర సామ్రాజ్యం అలాగే ఉంది
* నయీమ్ కు సహకరించిన బాధ్యులకు శిక్షలు పడాలి

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో ప్రముఖుల పాత్ర పట్ల స‌మ‌గ్ర విచారణ జ‌రిపించాల‌ని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు లేఖ రాసింది. ఈ లేఖలో పలు కీలక అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. 2016 ఆగ‌స్టు 8న జరిపిన ఎన్ కౌంటర్ లో నయీమ్ మృతి చెందాడు. నయీమ్ మృతి అనంతరం సిట్ చేసిన దర్యాప్తులో నయీమ్ ఇంట్లో 24 తుపాకులు లభ్యం కాగా..

అందులో 3 ఏకే-47 గన్ లు, ఒక స్టెన్ గన్ లు ఉన్నాయి. అలాగే నయీమ్ కు సంబంధించిన 752 భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు, 130 డైరీలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపింది. ఒక సాధారణ పౌరుడు తుపాకీ పొందడం కష్టం. ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటేనే అనేక ఆధారాలు ప్రూఫ్ లు అడిగే అధికారులు 752 రిజిస్ట్రేషన్లు ఎలా చేశారు. ఆ 130 డైరీలలో నయీమ్ రాసుకున్న 130 డైరీలలో ఉన్న సమాచారంతో దర్యాప్తు చేయకుండా ఎందుకు కోర్టుకు అప్పగించారని పేర్కొంది. నయీమ్ కు పోలీసులు, రాజకీయ నాయకులు, రెవెన్యూ, రిజిస్టేషన్ అధికారులు సహకరించడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులకు శిక్షలు పడాలని కోరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.