FbTelugu

రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్: హైదరాబాద్ నగరం మినహా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా ఇవాళ ఉదయం ఆరు గంటలకే బస్సులు బయటకు వచ్చాయి.

కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి సీఎం కేసీఆర్‌ మార్చి 22న లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే తాజాగా హైదరాబాద్‌ మినహా రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నడపడానికి ప్రభుత్వం అనుమతిండంతో 57 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కాయి. అన్ని డిపోల నుంచి 54 సీటింగ్‌ కెపాసిటీతో ప్రయాణికులను తీసుకువెళ్లాలని డ్రైవర్‌ కండక్టర్లకు సూచించారు.

విజయవాడ హైవే నుంచి వచ్చే బస్సులు హయత్‌నగర్‌ వరకు, మహబూబ్‌ నగర్‌ డిపో బస్సులు ఆరాంఘర్‌ వరకు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ డిపోల బస్సులు పహాడీషరీఫ్‌ వరకు, కరీంనగర్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకే పరిమితం చేశారు. ఎంజీబీఎస్ వరకు ఒక్క బస్సును కూడా అనుమతించ లేదు. ఇక్కడ దిగిన ప్రయాణీకులు ఆటోలు, క్యాబ్ లు, వ్యక్తిగత వాహనాల ద్వారా తమ ఇళ్లకు చేరుకోవాల్సి ఉంటుంది. కరోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా ఉండడంతో సిటీ బస్సులు, మెట్రో రైలు సర్వీసులు, ఎంఎంటీఎస్ లను అనుమతించ లేదు. వీటిపై ఈ నెలాఖరులో నిర్ణయం తీసుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.