FbTelugu

రోడ్డు టెర్రర్.. 11 మంది దుర్మరణం

తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం పాలయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బోర్ వెల్ లారీ, ఇన్నోవా వాహనాలు బలంగా ఢీకొని ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. మృతులంతా హైదరాబాద్ తాడ్ బన్ వాసులుగా గుర్తించారు.

కర్నూలు జిల్లా గూడూరు దగ్గర ఓ బైకు, ట్రాక్టర్ బలంగా ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బ్రాహ్మణదొడ్డి వాసులు కృష్ణ, గజ్జెలమ్మ, జానకమ్మగా గుర్తించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి దగ్గర స్కూటీ, టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.