FbTelugu

రోడ్డు ట్యాక్స్ గడువు పెంపుదల

అమరావతి: ఏపీలో రోడ్డు ట్యాక్స్ గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రోడ్డు ట్యాక్స్‌ చెల్లింపు గడువు పెంచాలని సీఎం వైఎస్.జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

సెప్టెంబరు ఆఖరు వరకు గడువు పెంచేందుకు సీఎం అంగీకరించారు. ఈమేరకు రవాణా శాఖ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నది. ఆటో, టాక్సీ డ్రైవర్ల ఇబ్బందులను సీఎం దృష్టికి రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తీసుకెళ్లారు. లాక్‌డౌన్‌ వల్ల ఆటోలు, టాక్సీలు సరిగా నడవడం లేదని సీఎం జగన్‌కు మంత్రి నివేదించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

You might also like