FbTelugu

న్యూఇయర్ వేడుకల్లో అపశ్రుతి

* రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి
ప్రకాశం : న్యూఇయర్ వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతిచెంది, మరో ఇద్దరి పరిస్థితి విషమించిన ఘటన జిల్లాలోని గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక కృష్ణంశెట్టిపల్లిలో కొందరు వ్యక్తులు న్యూఇయర్ వేడుకల్లో పాల్గొని బైకులపై వస్తుండగా.. రెండు బైకులు ప్రమాదవశాత్తూ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ బైకుపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.