FbTelugu

మద్యం మత్తులో డ్రైవర్… ఒకరు మృతి

హైదరాబాద్: హస్తినాపురంలో ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవర్ గౌతమ్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో సాగర్ రోడ్ నుండి ఇబ్రహీంపట్నం వైపు కారు ప్రయాణిస్తున్నది. అయితే కారులో మొత్తం ముగ్గురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నారు. ఈ ప్రమాదంలో వెనకాల సీటు లో కూర్చున్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే మరో యువకుడు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడు. విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న పోలీసులు డ్రైవర్ గౌతమ్ ను అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.