FbTelugu

ఆరుగురు యువకులను బలిగొన్న రోడ్డు ప్రమాదం

లక్నో: అదుపుతప్పి ఓ కంటైనర్ బోల్తాపడడంతో ఆరుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లా, గ‌జ్రౌలాలో ఇవాళ (సోమ‌వారం) తెల్ల‌వారు జామున‌ చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కంటైన‌ర్ లో ప‌శువుల‌ను తరలిస్తుండగా..

స్థానిక గ‌జ్రౌలాలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు యువ‌కులు అక్కడికక్కడే మృతి చెందగా.. 13 ప‌శువులు కూడా మృత్యువాత పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థ‌లానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.