FbTelugu

తల్లీ కూతుళ్లను బలిగొన్న ప్రమాదం

హైదరాబాద్: ఓ కారు ప్రమాదం తల్లీ కూతుళ్లను బలిగొన్న ఘటన నగరంలోని అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర వేగంగా వచ్చిన ఓ కారు ప్రమాదవ శాత్తూ మరో వాహనాన్ని బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులోని తల్లీ కూతురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.