FbTelugu

ఆంధ్రాలో పెరుగుతున్న కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రాలో మళ్లీ కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. మూడు నెలల తరువాత ఒకేరోజు 350 కు పైగా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి.
కేసుల ఉధృతి పెరగడంతో ఇప్పటికే మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలలో రాత్రిపూట లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేసులు ఇలాగే పెరిగితే రానున్న రోజుల్లో పూర్తిగా లాక్‌డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆంధ్రాలోనూ వైరస్ విజృంభిస్తోంది.

గడిచిన 24 గంటల్లో 380 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,93,366కి చేరింది. వైరస్ కారణంగా నిన్న కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి దాకా రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,189కి చేరుకుంది. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ను అప్రమత్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.