FbTelugu

రిషి అంత్యక్రియలు పూర్తి

ముంబై: మెరీనా లైన్స్ లోని చందన్ వాడీ స్మశాన వాటికలో బాలీవుడ్ నటుడు రిషికపూర్ అంత్యక్రియలు పూర్తయ్యాయి.

లుకేమియా క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి ఈ ఉదయం హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచిన విషయం విదితమే. అంత్యక్రియలకు ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ నివాళులు అర్పించి అంతిమ వీడ్కోలు పలికారు.

ఢిల్లీ నుంచి బయలుదేరిన కుమార్తె…

తండ్రి చనిపోయారని తెలిసిన వెంటనే కుమార్తె రిద్ధిమా కపూర్ ఈ ఉదయం ఢిల్లీ నుంచి బయలు దేరారు. ఢిల్లీ పోలీసులు ఆమెకు ప్రత్యేక పాస్ జారీ చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆమె రోడ్డు మార్గం ద్వారా ముంబై చేరుకోనున్నారు.

సుమారు 1400 కిలోమీటర్లు ఆమె ప్రయాణించాల్సి ఉంటుంది. అంత్యక్రియలు పూర్తి కావడంతో ఆమె కడచూపు ను నోచుకోలేకపోయింది.

You might also like