FbTelugu

రైసు మిల్లు కరెంటు బిల్లు రూ.80 కోట్లా?

ముంబయి: సాధారణంగా ప్రతినెలా వచ్చే బిల్లుకు కాస్త అటు ఇటుగా కరెంటు బిల్లు వస్తే ఆందోళన చెందరు. కాని ఒక రైసు మిల్లు యజమానికి రూ.80.13 కోట్ల విద్యుత్ బిల్లు రావడంతో మూర్చ వచ్చినంత పనైంది.

పాల్ఘర్ కు చెందిన గణపతి నాయక్ (66) కు రైస్ మిల్లు ఉంది. మిల్లు కు ప్రతి నెలా విద్యుత్ శాఖ రూ.50 వేలకు అటూ ఇటూగా బిల్లులు వేస్తుండేది. ఈనెల మాత్ర ఊహించని విధంగా పెంచేసి ఇచ్చేయడంతో యజమాని కి ముచ్చెమటలు పట్టాయి. సోమవారం నాడు రూ.80,13,89,600 బిల్లును పంపించారు. ఇది చూసిన ఆయన వెంటనే విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. వారు మిల్లు కు చేరుకుని మీటర్ రీడింగ్, పాత బిల్లలు చూసి సవరించారు. రూ.80 వేల బదులు రూ.80 కోట్ల బిల్లు వేశారంటూ చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.