FbTelugu

జస్టిస్ ఈశ్వరయ్య టేపులపై విచారణ: హైకోర్టు

అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ వి.ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారం నిగ్గు తేల్చాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సంభాషణలను నిర్థారణ చేసే బాధ్యతను సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ రవీంద్రన్ కు అప్పగించింది.
ఈ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) సహకారం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్ ఛార్జీ రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతి పై విచారణ జరపాలని విద్యార్థి నాయకుడు లక్ష్మీనర్సయ్య పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై జడ్జి రామకృష్ట ఇంప్లీడ్ అయ్యారు.

హైకోర్టు జడ్జీలపై ఏపీ ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్, మాజీ హైకోర్టు జడ్జి జస్టిస్ వి.ఈశ్వరయ్య పలు ఆరోపణలు చేశారని తన పిటీషన్ లో తెలిపారు. ఆరోపణలకు సంబంధించి ఆడియో టేపులను ఆయన హైకోర్టుకు సమర్పించారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ మారడంతో ఈశ్వరయ్య స్పందించారు. తను జడ్జి రామకృష్ణ తో మాట్లాడింది నిజమేనని, ఈ టేపులలో కొన్నింటిని కత్తిరించి రీలీజు చేశారంటూ మీడియాకు తెలిపారు.

You might also like