FbTelugu

రూ.15 లక్షల లంచం తీసుకున్న ఆర్ఐ!

హైదరాబాద్: ఓ స్థల వివాదంలో యాబై లక్షలు డిమాండ్ చేసి, రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు షేక్ పేట ఆర్ఐ నాగార్జున అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకెళితే.. బంజారాహిల్స్ లో ఒకటిన్నర ఎకరాల స్థల వివాదం చోటుచేసుకంది. సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తికి చెందిన స్థలాన్ని ప్రభుత్వం రెవెన్యూ స్థలంగా పేర్కొంది.

shikpet ri nagarjuna

ఈ వివాదంతో అధికారులు లంచాలకు తెగబడ్డారు. స్థానిక షేక్ పేట ఆర్ఐ నాగార్జున ఆ స్థల వివాద పరిష్కారానికి స్థల యజమాని నుంచి రూ. 50 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. కొద్ది సేపటి క్రితం ఆర్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా.. రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయితే ఆర్ఐ నాగార్జునతో పాటూ బంజారాహిల్స్ ఎస్సై రవీంద్ర నాయక్ కూడా డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలున్నాయి. దీంతో బంజారాహిల్స్ ఎస్సై రవీంద్ర ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

You might also like