FbTelugu

అర్థరాత్రి సూట్ కేసుతో రియా పరారీ

ముంబై: హిందీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తి తన తల్లిదండ్రులతో కలిసి ఒక కారులో పెద్ద సూట్ కేసుతో పరార్ అయినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి.

సుశాంత్ సింగ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో బిహార్ పోలీసులు ముంబైలో ఆమెను అరెస్టు చేసేందుకు తనిఖీలు చేస్తుండడంతో ఆమె పరారీ కావడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నీలం రంగు కారులో అర్థరాత్రి ఇంటి దగ్గరి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారని అపార్ట్ మెంట్ సూపర్ వైజర్ చెప్పారు. కొంతకాలంగా సుశాంత్, రియా ఇంటికి రావడం లేదని సూపర్ వైజర్ వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.

బిహార్ పోలీసుల విచారణ నుంచి తప్పించుకునేందుకు రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను 5వ తేదన విచారించనున్నది. అయితే ఈ పిటీషన్ పై తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలంటూ సుశాంత్ తండ్రి సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు.

You might also like