FbTelugu

పుష్ప మూవీ ట్రైలర్ పై RGV షాకింగ్ వ్యాఖ్యలు…

RGV shocking comments
RGV shocking comments; ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషనల్‌లో పదేళ్ల తర్వాత వస్తున్న చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇప్పటికే విడుదలైన పాటలు, పాత్రల ఫస్ట్ లుక్‌ పోస్టర్లు, మేకింగ్ వీడియో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా సినిమా ట్రైలర్‌ను ఊరించి ఊరించి సోమవారం (డిసెంబర్‌ 6) విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది
ఇందులో అల్లు అర్జున్‌ మాస్‌ గెటప్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. ఈ ట్రైలర్‌పై పలువురు సెలబ్రిటీలు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. అలాగే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పుష్ప ట్రైలర్‌పై తనదైన శైలిలో స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన పలువురు స్టార్‌ హీరోలపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ‘ఏమాత్రం భ‌య‌ప‌డ‌కుండ ఇలాంటి రియలిస్టిక్ పాత్ర‌లో న‌టించిన అల్లు అర్జున్‌ ని మాత్రమే సొంతం పవన్ కల్యాణ్‌, చిరంజీవి, రజినీకాంత్, మహేశ్‌ బాబుతో పాటు మిగతా స్టార్‌ హీరోలు ఇలాంటి పాత్రలు చేయగలరా? “పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్’ అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు.
ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
You might also like

Leave A Reply

Your email address will not be published.