FbTelugu

‘రైతులకు అండగా నిలవాల్సిందిపోయి మోదీకి వత్తాసా ? 

* కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్ 

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాల్సింది పోయి తెలంగాణ సీఎం మోదీకి వత్తాసు పలుకుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఇవాళ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 పార్టీలు బహిష్కరించగా.. కేసీఆర్ మాత్రం అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని అన్నారు. రైతు ద్రోహిగా కేసీఆర్ మిగిలిపోయారన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల్లో ఇప్పుడు క్లారిటీ వచ్చిందని, తమ పక్షాన ఎవరు ఉన్నారు? ఎవరు లేరు? అనే విషయం వారికి అర్థమయిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.